సోమవారం 25 జనవరి 2021
Crime - Nov 24, 2020 , 17:40:29

బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..తండ్రి, కొడుకు మృతి

 బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..తండ్రి, కొడుకు మృతి

వరంగల్‌ అర్బన్‌ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్‌ నగరంలో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తండ్రి, కొడుకు మృత్యువాతపడ్డారు. ఎస్సై వీరేందర్‌ కథనం ప్రకారం.. హన్మకొండ బాలసముద్రం న్యూ అంబేద్కర్‌ కాలనీకి చెందిన గజ్జల సంజీవ్‌(35), కొడుకు రిఫేశ్‌(14)తో కలిసి స్కూటీపై మంగళవారం ఉదయం హంటర్‌రోడ్డు దీన్‌దయాళ్‌ నగర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో నక్కలగుట్టలో ఆర్టీసీ బస్సు వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సంజీవ్‌ భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 


logo