బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 27, 2020 , 18:53:30

రూ.83.7 ల‌క్ష‌ల విలువైన‌ బంగారం సీజ్‌

రూ.83.7 ల‌క్ష‌ల విలువైన‌ బంగారం సీజ్‌

చెన్నై : దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకువ‌చ్చిన రూ .83.7 లక్షల విలువైన 1.62 కిలోల బంగారాన్ని చెన్నై విమానాశ్ర‌యంలో ఎయిర్ ఇంట‌లిజెన్స్ అధి‌కారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. రామనాథపురం జిల్లాకు చెందిన మొహద్ ముస్తఫా మీరాసా మరైక్కాయర్(43), సాహుబర్ అలీ ఐంజాయి(39), పుదుక్కోటై జిల్లాకు చెందిన షేక్ అబ్దుల్లా హబీబ్ అబ్దుల్లా (21) అనే ముగ్గురు ప్ర‌యాణికులు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో శ‌నివారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. నిందితులు పురీషనాళంలో అదేవిధంగా పాయింట్ జేబుల్లో బంగారాన్ని పేస్ట్ రూపంలో అక్ర‌మంగా ర‌వాణా చేశారు.  


logo