గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 05, 2020 , 18:34:59

చెన్నై ఎయిర్ పోర్ట్ లో రూ.82.3లక్షల విలువైన బంగారం పట్టివేత

 చెన్నై ఎయిర్ పోర్ట్ లో రూ.82.3లక్షల విలువైన బంగారం పట్టివేత

చెన్నై: చెన్నై ఎయిర్ పోర్ట్ లో రూ.82.3లక్షల విలువైన 1.48 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఐదుగురి నుంచి 1.2 కిలోల గోల్డ్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం ప్యాకెట్లను చెప్పుల్లో పెట్టుకొని షార్జా నుంచి వచ్చారు. ఇక దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఓ పాసింజర్ తన అండర్ వేర్‌లో 280 గ్రాముల బంగారాన్ని తీసుకువస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo