శనివారం 23 జనవరి 2021
Crime - Oct 11, 2020 , 20:15:14

రూ.96 లక్షలు సీజ్.. 65 మంది అరెస్ట్

రూ.96 లక్షలు సీజ్.. 65 మంది అరెస్ట్

బెంగళూరు: జోరుగా పేకాడుతున్న కొందరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం బెంగళూరులోని ఒక జూదం కేంద్రంపై ఆకస్మికంగా రైడ్ చేశారు. మహాదేవపుర ప్రాంతంలోని పేకాట స్థావరంలో తనిఖీలు నిర్వహించారు. పేకాడుతున్న 65 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.96 లక్షలను సీజ్ చేసినట్లు బెంగళూరు నేర విభాగానికి చెందిన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ పాటిల్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo