సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jun 28, 2020 , 14:15:00

విశాఖలో రూ.50లక్షల నగదు పట్టివేత

విశాఖలో రూ.50లక్షల నగదు పట్టివేత

విశాఖపట్నం: నగరంలోని ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులుని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకుని అతని వద్ద నుంచి  రూ.50లక్షల 38వేలను స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరసింహారావు అనే వ్యక్తి  ఎటువంటి పత్రాలు లేకుండా రూ. 50.38లక్షలను విశాఖ నుంచి నరసాపురం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నరసాపురంలోని ఒక జ్యువెల్లర్‌ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే దుకాణ యజమాని ప్రవీణ్‌ కుమార్‌ జైన్‌ తనను విశాఖకు పంపించాడని గుమస్తా  పోలీసులకు వెల్లడించారు.  అతని దగ్గర ఉన్న ఫోన్లో సీక్రెట్ కోడ్ ఉండడంతో హవాలా మార్గంలో తరలిస్తున్న బ్లాక్ మనీగా భావించి నగదుతో పాటు గుమస్తాను టూ టౌన్ పోలీసులకు అప్పగించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. logo