బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 30, 2020 , 15:07:04

రూ.42 కోట్ల విలువైన బంగారు కడ్డీలు పట్టివేత.. ఎనిమిది మంది అరెస్ట్‌

రూ.42 కోట్ల విలువైన బంగారు కడ్డీలు పట్టివేత.. ఎనిమిది మంది అరెస్ట్‌

న్యూ ఢిల్లీ : ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఎనిమిది మందిని శుక్రవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి 504 విదేశీ బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఈ బంగారు కడ్డీల బరువు 83.621కేజీలు ఉండగా వీటి విలువ సుమారు రూ. 42.89 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. వీటిని ప్రత్యేకంగా తయారు చేసిన వస్ర్త సంచుల్లో తరలిస్తున్నట్లు తెలిపారు. 

‘ఢిల్లీలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అనుమానాస్పదంగా ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులను అడ్డగించి తనిఖీలు చేపట్టగా వారి వద్ద 504 బంగారు కడ్డీలు ఉన్నాయి. నిందితులను ఐడెంటీ కార్డులు అడగ్గా వారు నకిలీ కార్డులను చూపారు. ఇండో-మయన్మార్ సరిహద్దు నుంచి భారతదేశంలోకి ఈ బంగారు కడ్డీలను అక్రమంగా రవాణా  చేస్తున్నా’రని అధికారులు తెలిపారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ఆదివారం పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo