శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 15:36:46

రూ.2 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌

రూ.2 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌

కొత్త‌గూడెం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో శుక్ర‌వారం రాత్రి పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బ్లాక్ మార్కెట్‌లో సుమారు రూ.2.12 కోట్లు ఉంటుంద‌ని వారు తెలిపారు. హైద‌రాబాద్‌కు చెందిన రాజు, ప‌వార్ కర్ణాట‌క‌కు చెందిన పప్పుల న‌గేశ్‌, గ‌న్నె ర‌వి, మోత్రె ప్ర‌కాశ్ అనే ఐదుగురు వ్య‌క్తులు కూర‌గాయ‌ల ట్ర‌క్కులో గంజాయి త‌ర‌లిస్తుండ‌గా అనుమానం వేసి త‌నిఖీలు చేప‌ట్ట‌గా భారీగా గంజాయి క‌ట్ట‌లు ల‌భించాయ‌ని ఏఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకొని, ఐదుగురిపై కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo