మంగళవారం 01 డిసెంబర్ 2020
Crime - Oct 08, 2020 , 14:16:00

రూ. 2. 54 లక్షల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

రూ. 2. 54 లక్షల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలో రూ. 2.54 లక్షల గుట్కా, అంబర్ ప్యాకెట్లను పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ టాస్‌ఫోర్స్ సీఐ మోహన్ గురువారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మండల కేంద్రంలోని కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించగా.. వినయ్ కిరాణం షాపులో రూ.2,54, 400 లక్షల విలువగల గుట్కా, పాన్ మసాలా, అంబర్ ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

కిరాణం యజమాని బజ్జురి రామ్మోహన్, అతనికి సహకరించిన ఓదెల శ్రీహరిపై కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న సరుకులను చిట్యాల పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ తెలిపారు. ఈ సోదాల్లో టాస్‌ఫోర్స్ ఎస్ఐ విజయ్ కుమార్, ఎస్‌ఐ గోపాల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.