శుక్రవారం 22 జనవరి 2021
Crime - Oct 14, 2020 , 19:25:54

యూట్యూబ్‌లో చూసి రూ.100 నకిలీ నోట్లు తయారు.. ఇద్దరు అరెస్ట్‌

యూట్యూబ్‌లో చూసి రూ.100 నకిలీ నోట్లు తయారు.. ఇద్దరు అరెస్ట్‌

చండీగఢ్‌: యూట్యూబ్‌లో వీడియోలు చూసి రూ.100 నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పంజాబ్‌ రాష్ట్రం మెహర్బన్ పరిధిలోని మాట్టేవారా గ్రామానికి చెందిన ఇద్దరు నకిలీ వంద కరెన్సీ నోట్లు ముద్రిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లుధియానా పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. సుమారు 2.5 లక్షల విలులైన నకిలీ రూ.100 నోట్లతోపాటు కలర్‌ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల ముద్రణ గురించి తెలుసుకునేందుకు నిందితులు తొలుత యూట్యూబ్‌లో పలు వీడియోలు చూశారని లూధియానా జాయింట్ కమిషనర్ (గ్రామీణ) కన్వర్‌దీప్ కౌర్ తెలిపారు. అనంతరం వారు ఒక కలర్‌ ప్రింటర్‌ను కొనుగోలు చేశారని ఆమె చెప్పారు. తొలుత ఒక ఒరిజినల్‌ వంద రూపాయల నోటును రెండు వైపులా స్కాన్‌ చేసి అనంతరం కలర్‌ ప్రింట్‌ తీసుకుని నీటుగా కట్‌ చేసి నకిలీ నోట్లు తయారు చేసినట్లు వివరించారు. నిందితులను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo