సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 27, 2020 , 18:28:10

కొత్త షర్టులు, కొత్త చీరల మధ్య.. రూ.1.36 కోట్ల నగదు

కొత్త షర్టులు, కొత్త చీరల మధ్య..  రూ.1.36 కోట్ల నగదు

చెన్నై: కొత్త షర్టులు, కొత్త చీరల మధ్య భారీగా డబ్లులు దాచి గుట్టుగా విదేశాలకు తరలించే ప్రయత్నాన్ని తమిళనాడులోని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. సింగపూర్‌కు పంపే మూడు కొరియర్ పార్శిల్స్‌ను చెన్నై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. కొరియర్ టెర్నినల్ వద్ద వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ  మూడు పార్శిల్స్‌ను తెరిచి చూడగా కొత్త షర్టులు, కొత్త చీరల మధ్య భారీగా దేశీయ, విదేశీ నగదు లభించింది. 50,000 అమెరికా డాలర్లు, 4,000 యూరోలతోపాటు రూ.30 లక్షల భారత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.


ఈ మొత్తం నగదు విలువ రూ.1.36 కోట్ల విలువని కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాగా, ఇటీవల సింగపూర్‌కు తరలిస్తున్న కొరియర్ పార్శిల్‌లో స్టీలు పేట్ల మధ్య ఉంచిన విదేశీ కరెన్సీని చెన్నై ఎయిర్‌పోర్టులోని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అయినప్పటికీ కొరియర్ పార్శిల్స్‌లో నగదు తరలింపు ఆగడం లేదు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo