శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 02, 2020 , 12:11:17

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో రౌడీషీట‌ర్ హ‌త్య‌

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో రౌడీషీట‌ర్ హ‌త్య‌

నాగ‌ర్‌క‌ర్నూల్ : తిమ్మాజిపేట మండ‌ల ప‌రిధిలోని ఆవంచ‌లో శ‌నివారం రాత్రి దారుణం జ‌రిగింది. గ్రామంలో జ‌న‌సంచారం మ‌ధ్య ఓ రౌడీషీట‌ర్‌ను అత్యంత కిరాత‌కంగా చంపేశారు. గ్రామానికి చెందిన బ‌చ్చ‌ల‌కూర మాస‌య్య (40) శ‌నివారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అదే స‌మ‌యంలో అక్క‌డే మాటు వేసిన కొంద‌రు దుండ‌గులు.. మాస‌య్య‌ను వెంబ‌డించారు. గ్రామం న‌డిబొడ్డున ఉన్న ద‌ర్గా వ‌ద్ద మాస‌య్య‌ను అడ్డగించి.. క‌త్తుల‌తో దాడి చేసి హ‌త్య చేశారు.

దీంతో మాస‌య్య గ‌ట్టిగా అర‌వ‌డంతో.. స్థానికులు బ‌య‌ట‌కు వ‌చ్చారు. ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉన్న మాస‌య్య‌ను చూసి తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. త‌క్ష‌ణ‌మే తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాస్‌కు స్థానికులు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాస‌య్య హ‌త్య‌కు పాత క‌క్ష‌లే కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. 


logo