గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Sep 05, 2020 , 15:37:29

హైద‌రాబాద్ ఓల్డ్ సిటీలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌

హైద‌రాబాద్ ఓల్డ్ సిటీలో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌

హైదరాబాద్ : న‌గ‌రంలోని పాత బ‌స్తీలో గుర్తు తెలియ‌ని దుండ‌గులు రౌడీ షీట‌ర్‌ను దారుణంగా హ‌త్య చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాలు.. పాత‌బ‌స్తీలోని ఫ‌ల‌క్‌నూమా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అన్సారీ రోడ్ వ‌ద్ద రౌడీ షీట‌ర్ మ‌హ్మ‌ద్ జావీద్‌పై శుక్ర‌వారం అర్ధ‌రాత్రి గుర్తు తెలియ‌ని ముగ్గురు వ్య‌క్తులు దాడి చేశారు. ప‌దునైన ఆయుధాల‌తో విచ‌క్ష‌ణా ర‌హితంగా నరి‌కి పారిపోయారు. జావీద్ ఛాతీ, కడుపు, చేతులకు తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని క్ష‌త‌గాత్రుడిని ఉస్మానియా ద‌వాఖానకు త‌ర‌లించ‌గా.. చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు తెలిపారు. 

ఘటన జరిగిన వెంటనే క్లూస్ టీంను రంగంలోకి దింపామ‌ని, కేసు న‌మోదు చేసి నేర‌స్తుల కోసం వెతుకుతున్నామ‌ని ఫ‌ల‌క్‌నూమా పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo