ఆదివారం 17 జనవరి 2021
Crime - Oct 06, 2020 , 11:46:39

హైద‌రాబాద్‌లో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌

హైద‌రాబాద్‌లో రౌడీషీట‌ర్ దారుణ హ‌త్య‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని కుల్సుంపురా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో దారుణం జ‌రిగింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు ఖాదీర్ అనే రౌడీషీట‌ర్‌ను ఇద్ద‌రు దుండ‌గులు హ‌త్య చేశారు. ఆ ఇద్ద‌రిని మృతుడి స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. ఖాదీర్‌ను హ‌త్య చేసిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను కుల్సుంపురా పోలీసులు అరెస్టు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఖాదీర్ ఫ‌ల‌క్‌నూమాకు చెందిన రౌడీషీట‌ర్ కాగా, మిగ‌తా ఇద్ద‌రు ట‌ప్చాబుత్రకు చెందిన వారు.