బుధవారం 30 సెప్టెంబర్ 2020
Crime - Jun 25, 2020 , 10:33:57

పీఎన్‌టీ కాలనీలో రౌడీషీటర్‌ హత్య

పీఎన్‌టీ కాలనీలో రౌడీషీటర్‌ హత్య

హైదరాబాద్‌ : నగరంలోని సరూర్‌నగర్‌ పీఎన్‌టీ కాలనీలో గడిచిన రాత్రి హత్య ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి గౌలిగూడకు చెందిన రౌడీషీటర్‌ వినయ్‌పై పాతనేరస్థులు కత్తితో దాడి చేసి చంపారు. నగదు, సెల్‌ఫోన్‌ విషయంలో వివాదమే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు సంతోష్‌నగర్‌కు చెందిన అన్నదమ్ములు సందీప్‌, సంతోష్‌కుమార్‌గా సమాచారం. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


logo