గురువారం 25 ఫిబ్రవరి 2021
Crime - Jan 26, 2021 , 08:41:24

సనత్‌నగర్‌లో రౌడీషీటర్‌ దారుణ హత్య

సనత్‌నగర్‌లో రౌడీషీటర్‌ దారుణ హత్య

హైదరాబాద్ : సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బోరబండలో రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి బోరబండలోని తన ఇంటి సమీపంలో ఫిరోజ్‌ (45)పై కత్తులతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన అతడిని సమీపంలోని రినోవా దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo