ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Crime - Jan 23, 2021 , 09:56:55

తమిళనాడులో దోపిడీ.. హైదరాబాద్‌లో చిక్కిన దొంగలు

తమిళనాడులో దోపిడీ.. హైదరాబాద్‌లో చిక్కిన దొంగలు

హైదరాబాద్‌ : తమిళనాడులోని హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో బంగారం లూటీ చేసిన కర్ణాటకకు చెందిన దొంగల ముఠా హైదరాబాద్‌ పోలీసులకు చిక్కింది. సైబరాబాద్‌ పోలీసులు ముఠాను శనివారం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని హోసూరులో దొంగల ముఠా శుక్రవారం దోపిడీకి పాల్పడింది. హోసూరు -బాగలూరు రోడ్డులో ఉన్న ముత్తూట్‌ కార్యాలయంలోకి దుండగులు ముఖాలకు మాస్క్‌లు ధరించి హెల్మెట్లు పెట్టుకొని లోపలికి ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డును కొట్టి లోపలికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఐదుగురు సిబ్బంది, ముగ్గురు కస్టమర్లు ఉన్నారు. అయితే, దోపిడీకి ముందు మేనేజర్‌, నలుగురు సిబ్బందిని తుపాకీలతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. దాదాపు 25 కిలోలకుపైగా బంగారం, లాకర్లలో ఉన్న రూ.96వేల నగదు దోచుకెళ్లినట్లు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపహరణకు గురైన బంగారం విలువ సుమారు రూ.7.5 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, దోపిడీకి ముఠా అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

VIDEOS

logo