ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 27, 2020 , 12:03:38

మణప్పురం కార్యాలయంలో చోరీ యత్నం!

మణప్పురం కార్యాలయంలో చోరీ యత్నం!

మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలో ఉన్న మణప్పురం గోల్డ్‌ లోన్ కార్యాలయంలో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. దొంగతనానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని న్యూ టౌన్‌లో శనివారం అర్థరాత్రి పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మణప్పురం కార్యాలయం వద్ద శబ్దాలు రావడంతో అప్రమత్తమైన పోలీసులు లోపలికి వెళ్లి చూశారు. చోరీకి పాల్పడుతన్న ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. కార్యాలయం తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన దుండగులు దొంగతనానికి ప్రయత్నించారని వెల్లడించారు. అయితే గోల్డ్ లోన్ కార్యాలయంలో ఏదైనా చోరీకి పాల్పడ్డరా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఘటనా స్థలాన్ని పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.logo