మంగళవారం 20 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 10:41:51

స‌దాశివ‌న‌గ‌ర్‌లో కండెరాయ ఆల‌యంలో చోరీ

స‌దాశివ‌న‌గ‌ర్‌లో కండెరాయ ఆల‌యంలో చోరీ

కామారెడ్డి: జిల్లాలోని స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లంలోని కండెరాయ‌ ఆల‌యంలో దుండ‌గులు చోరీకిపాల్ప‌డ్డారు. ఆదివారం రాత్రి ఉత్త‌నూరు గ్రామంలోని కండెరాయ ఆల‌య గేటు తాళాలు ప‌గల‌గొట్టి లోప‌లికి చొర‌బ‌డ్డారు. ఆల‌యంలోని హుండీ, లాక‌ర్ ధ్వంసం చేసి న‌గ‌దు, వెండి ఆభ‌ర‌ణాలు ఎత్తుకెళ్లారు. చోరీ జ‌రిగిన విష‌యాన్ని గుర్తించిన గ్రామ‌స్థులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు, ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించారు. చోరీ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.  


logo