సోమవారం 06 జూలై 2020
Crime - Jun 30, 2020 , 07:28:42

ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

హైదరాబాద్‌ : ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లిన సంఘటన గజ్వేల్‌ నియోజకవర్గం హైదరాబాద్‌-రామగుండం రాజీవ్‌నగర్‌ రహదారిపై ప్రజ్ఞాపూర్‌ వద్ద శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రజ్ఞాపూర్‌ వద్ద ఉన్న ఇండియా వన్‌ ఏటీఎంను ఏకంగా గడ్డపారతో తొవ్వి దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఏటీఎం ఉన్న ఇంటి యజమాని దీనిని గమనించి ఏటీఎం నిర్వహకులకు సమాచారం అందించాడు. నిర్వహాకులు 24 గంటల తర్వాత అనగా సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో గజ్వేల్‌ ఏసీపీ నారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఏటీఎంలో 4,98,800 నగదు ఉన్నట్లు నిర్వహకులు పోలీసులకు తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఏటీఎం దొంగలించిన 24 గంటల తర్వాత పోలీసులకు సమాచారం అందిచడంతో ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంను దొంగలించేందుకు నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 


logo