ఆదివారం 24 జనవరి 2021
Crime - Oct 06, 2020 , 09:31:32

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి కోసం వెళ్తున్న కార్మికులను గ్యాస్‌ ట్యాంకర్‌ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. ధార్ జిల్లాలోని ఇండోర్-అహ్మదాబాద్ రహదారిపై తిర్లా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చిఖాలియా ఫటా వద్ద సోయాబీన్ పంట సేకరించే 20 మందికిపైగా కార్మికులతో నిండిన వ్యాన్‌ పంక్ఛర్‌ కావడంతో రోడ్డు పక్కన డ్రైవర్‌ నిలిపివేశారు. అటు వైపుగా వెనుక నుంచి వచ్చిన గ్యాస్ ట్యాంకర్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనంలో కూర్చున్న ఆరుగురు కార్మికులు అట్టడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో 14 మంది గాయపడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స కోసం ఇండోర్‌ దవాఖానకు తరలించారు.

సంఘటన సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ ఆదిత్య ప్రతాప్ సింగ్, సీఎస్పీ దేవేంద్ర కుమార్, ధుర్వే సీఎస్పీ తరుణ్ సింగ్ బాగెల్, తిరాలా పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ రంజిత్ సింగ్ బాగెల్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీస్‌ సూపరింటెండెంట్‌ క్షతగాత్రులను చికిత్స కోసం తన వాహనంలోనే దవాఖానకు తరలించారు. మృతుల కుటుంబాలకు కలెక్టర్‌ సింగ్‌ అలోక్‌సింగ్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనలో బాల కార్మికులతో సహా 6 మంది మృతి చెందారు. కాగా పెద్ద సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo