సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jun 23, 2020 , 16:44:20

కోదాడలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కోదాడలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని 65వ జాతీయ రహదారిపై బైకును కారు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. కోదాడ పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన వేములపల్లి కోటేశ్వర్‌రావు (50)పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. మంగళవారం సాయంత్రం వ్యక్తిగత పని నిమిత్తం టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనంపై పట్టణ శివారులోని శ్రీరంగాపురానికి వెళ్తుండగా.. జంక్షన్‌ వద్దకు రాగానే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తున్న కారు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కోటేశ్వర్‌రావుకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం కోదాడ ఏరియా దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


logo