బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 23, 2020 , 07:06:47

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

అమరావతి : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది తీవ్రగాయాలయ్యాయి. ఈపూరు మండలం కొండ్రముట్ట వద్ద ప్రమాదం జరిగింది. ఆర్మూర్‌ నుంచి ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితుల వివరాలు తెలియరాలేదు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo