శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 08, 2020 , 08:55:43

సుశాంత్‌ సోదరిపై రియా ఫోర్జరీ కేసు

సుశాంత్‌ సోదరిపై రియా ఫోర్జరీ కేసు

ముంబై : బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో వివిధ దర్యాప్తు సంస్థల నుంచి విచారణను ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ కథానాయిక రియా చక్రవర్తి సోమవారం సుశాంత్‌ సోదరి ప్రియాంక సింగ్‌ ఫోర్జరీ పాల్పడ్డారని పేర్కొంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్‌ మరణం తర్వాత ఐదు రోజులకు మత్తు పదార్థాల కోసం ఢిల్లీలోని రాం మనోహర్‌ లోహియా దవాఖాన వైద్యుడు డాక్టర్‌ తరుణ్‌కుమార్‌ నుంచి ప్రిస్క్రిప్షన్‌ పొందారని ప్రియాంక సింగ్‌ ‘బోగస్‌ మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌' తీసుకొచ్చారని ఆరోపించారు. మరణించిన వ్యక్తికి చట్టవిరుద్ధ మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ ఎలా ఇచ్చారన్న విషయమై అత్యవసరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు సీబీఐ అధికారుల ముందు వరుసగా రెండో రోజు రియా చక్రవర్తి విచారణకు హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo