శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 18, 2020 , 13:36:06

సుశాంత్ కేసు.. ఆదిత్య‌థాక‌రేను రియా క‌ల‌వ‌లేదు

సుశాంత్ కేసు.. ఆదిత్య‌థాక‌రేను రియా క‌ల‌వ‌లేదు

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తి లాయ‌ర్ ఇవాళ కొన్ని విష‌యాల‌ను వెల్ల‌డించారు.  ఇప్ప‌టి వ‌ర‌కు శివ‌సేన నేత ఆదిత్య థాక‌రేతో న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి ఎన్న‌డూ క‌ల‌వ‌లేద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సుశాంత్ మృతి కేసులో శివ‌సేన నేత పాత్ర ఉన్న‌ట్లు అనుమానాలు వ్యాపిస్తున్న నేప‌థ్యంలో రియా లాయ‌ర్ ఈ విష‌యాన్ని చె‌ప్పారు. ఆదిత్య థాక‌రేతో రియా ఎప్పుడూ టెలిపోన్‌లో కానీ ఇత‌ర విధంగా కానీ మాట్లాడ‌లేద‌న్నారు.  ఆదిత్య థాక‌రే శివ‌సేన నేత అన్న విష‌యాన్ని ఆమె తెలుసుకున్న‌ట్లు రియా న్యాయ‌వాది చెప్పారు. సుప్రీంకోర్టులో జ‌రిగిన గ‌త విచార‌ణ ఆధారంగా.. సుశాంత్ మృతి కేసు రాజ‌కీయంగా మారిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు.  ఆ కేసులో వాస్త‌వాలు తెలియ‌డం లేద‌న్నారు. అన‌వ‌స‌ర‌మైన‌, అసంబద్ద‌మైన ప‌త్రాల‌ను ఈ కేసులో స‌మ‌ర్పిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో.. అనేక మంది నేత‌లు ఈ కేసును అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నార‌ని రియా చ‌క్ర‌వ‌ర్తి లాయ‌ర్ తెలిపారు.  చ‌ట్టం ప్ర‌కారం బీహార్ పోలీసులు సుశాంత్ కేసులో జీరో ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని, ఆ త‌ర్వాత కేసును ముంబై పోలీసుల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌న్నారు.  బీహార్ పోలీసుల‌కు ముంబైలో విచార‌ణ జ‌రిపే అధికారం లేద‌న్నారు.  అక్ర‌మ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతున్న విచార‌ణ‌కు రియా లొంగిపోదు అని ఆమె త‌ర‌పు న్యాయ‌వాది తెలిపారు. logo