శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 24, 2020 , 13:49:45

రియా చక్రవర్తికి సీబీఐ సమన్లు జారీ చేయలేదు: న్యాయవాది

రియా చక్రవర్తికి సీబీఐ సమన్లు జారీ చేయలేదు: న్యాయవాది

ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ఆయన స్నేహితురాలు నటి అయిన రియా చక్రవర్తికిగాని ఆమె కుటుంబ సభ్యులకుగాని సీబీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమన్లు అందలేదని ఆమె తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే తెలిపారు. సీబీఐ వారికి సమన్లు జారీ చేసినట్లు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన అన్నారు. ఒకవేళ సీబీఐ సమన్లు జారీ చేస్తే దర్యాప్తు సంస్థ ఎదుట వారు హాజరవుతాయని ఆయన చెప్పారు.

సుశాంత్ సింగ్ జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అయితే ఆయన మరణంపై కుటుంబసభ్యులు, స్నేహితులు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు తన కుమారుడి బ్యాంకు ఖాతాల నుంచి సుమారు రూ.15 కోట్లు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లాయని, సుశాంత్ మరణానికి వారే కారణమంటూ తండ్రి కేకే సింగ్ జూలైలో పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే బీహార్ పోలీసుల దర్యాప్తునకు ముంబై పోలీసులు సహకరించలేదు. దీంతో బీహార్ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించగా సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. దర్యాప్తునకు సహకరించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. దీంతో గురువారం ముంబై వచ్చిన సీబీఐ అధికారులు శుక్రవారం నుంచి దర్యాప్తును ప్రారంభించారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo