కరీంనగర్ : జిల్లాలోని చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ వద్ద గురువారం ఉదయం బావిలో పడిన కారు దుర్ఘటనలో రిటైర్డ్ ఎస్ఐ పాపయ్య నాయక్ మృతిచెందాడు. రెస్క్యూ బృందం 9 గంటల పాటు శ్రమించి కారును బావిలోంచి బయటకు తీశారు. నాయక్ స్వస్థలం వరంగల్ అర్భన్ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి మండలం నర్సింహులతండా. హుస్నాబాద్, అక్కన్నపేట పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా పని చేసి రెండేళ్ల క్రితం అక్కన్నపేటలో పదవీ విరమణ పొందాడు.