శనివారం 16 జనవరి 2021
Crime - Sep 21, 2020 , 13:19:51

విశ్రాంత నేవి అధికారి హత్య

విశ్రాంత నేవి అధికారి హత్య

న్యూఢిల్లీ : విశ్రాంత నేవి అధికారిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. న్యూఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో ఈ ఘటన కలకలం సృష్టించింది. ద్వారకా ప్రాంతానికి చెందిన బాలరాజ్‌ దేశ్‌వాల్‌ అనే వ్యక్తి గతంలో నేవిలో పనిచేసి రిటైర్‌ అయ్యాడు. ప్రస్తుతం ప్రాపర్టీ బ్రోకర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఓ విషయంలో ప్రదీప్‌ ఖోఖర్‌ అనే వ్యక్తితో అతడికి తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దదిగా మారి పెనుగులాటకు దారి తీసింది. దీంతో విచక్షణ కోల్పోయిన ప్రదీప్‌ ఖోకర్‌ తుపాకీతో దేశ్‌వాల్‌పై కాల్పులు జరిపి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడి అతడిని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఆస్తి వివాదమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.