శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 30, 2020 , 20:58:46

భార్యను కాల్చి చంపిన రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్

భార్యను కాల్చి చంపిన రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్

బండిపుర : జమ్మూ కశ్మీర్‌లోని బండిపుర జిల్లాలో రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ తన భార్యను కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. బండిపుర జిల్లాలోని సోకాబాబా గ్రామంలో మాజీ ఆర్మీ కెప్టెన్ గులాం హసన్ ఖాన్ తన భార్య ఫాతిమా బేగం(52)తో కలిసి గత కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు. ఈనెల 27న భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా కోపోద్రిక్తుడైన హసన్‌ఖాన్‌ తన 12 బోర్‌ లోడెడ్‌ గన్‌తో ఫాతిమాపై కాల్పులు జరిపాడు. బుల్లెట్‌ ఆమె తలకు తగులడంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి వెళ్లిపోయింది.

కాల్పుల శబ్దం విన్న స్థానికులు ఘటనా స్థలానికి వచ్చి ఫాతిమాను చికిత్స నిమిత్తం శ్రీనగర్‌లోని ఎస్‌ఎంహెచ్‌ఎస్ దవాఖానకు తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఫాతిమా ఆదివారం మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బండిపుర జిల్లా దవాఖాను తరలించారు. హసన్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకొని, అతడు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo