శుక్రవారం 15 జనవరి 2021
Crime - Dec 15, 2020 , 14:39:18

పెంపుడు కుక్కలను చూసుకోవడంలేదని చెల్లెని చంపాడు..!

పెంపుడు కుక్కలను చూసుకోవడంలేదని చెల్లెని చంపాడు..!

మీరట్‌: మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. చిన్నచిన్న కారణాలతో కొందరు సొంత కుటుంబ సభ్యులనే పొట్టనపెట్టుకుంటున్నారు. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కలను చూసుకునేందుకు నిరాకరించిందనే కారణంతో ఓ అన్న తన సొంత చెల్లెలిని కాల్చి చంపాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది.

మీరట్‌ నగరంలోని భవన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఆశిష్‌(25), పారుల్‌ (23) అన్నాచెల్లెలు. వారికి 18-20 పెంపుడు కుక్కలున్నాయి. అయితే, పారుల్‌ ఆ కుక్కల సంరక్షణ చూసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆశిష్‌, పారుల్‌ మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన ఆశిష్‌.. చెల్లెలు అనికూడా చూడకుండా పారుల్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆశిష్‌ను అదుపులోకి తీసుకున్నారు.  రెండు డజన్లకు పైగా కుక్కలను చూసుకోవడానికి నిరాకరించడంతోనే నిందితుడు తన సోదరిని చంపాడని పోలీసు సూపరింటెండెంట్ దేహాత్ కేశవ్‌కుకుమార్ తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.