బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 29, 2020 , 17:32:11

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో రియ‌ల్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో రియ‌ల్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని నాచారంలో గ‌ల ఓ లాడ్జిలో శ‌నివారం ఓ రియ‌ల్ట‌ర్ మృతిచెంది ప‌డిఉన్నాడు. ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా ఒత్తిడికి గురై విషం సేవించి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లుగా పోలీసులు తెలిపారు. క‌రీంన‌గ‌ర్‌కు చెందిన‌ వెంక‌ట న‌ర్స‌య్య‌(55) అనే రియ‌ల్ట‌ర్‌ శుక్ర‌వారం నాడు హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. వ్యాపారం నిమిత్తం వ‌చ్చిన‌ట్లుగా చెప్పి లాడ్జిలో దిగాడు. గ‌డిచిన అర్థ‌రాత్రి విషం తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. శ‌నివారం ఉద‌యం గ‌ది నుంచి ఎటువంటి స్పంద‌న‌లు లేక‌పోవ‌డంతో లాడ్జి సిబ్బంది నాచారం పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

పోలీసులు వెళ్లి బ‌ల‌వంతంగా త‌లుపు తెరిచి చూడ‌గా మంచంపై విఘ‌త జీవిగా క‌నిపించాడు. సంఘ‌ట‌నా స్థ‌లంలో ఆత్మ‌హ‌త్య లేఖ‌ను పోలీసులు క‌నుగొన్నారు. అర్థిక స‌మ‌స్య‌ల‌తో జీవితాన్ని ముగిస్తున్న‌ట్లుగా లేఖ‌లో పేర్కొన్నాడు. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం రూ. కోటి వ‌ర‌కు అప్పులు ఉన్న‌ట్లుగా తెలిసింద‌న్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని త‌ర‌లించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. 


logo