శుక్రవారం 15 జనవరి 2021
Crime - Dec 21, 2020 , 20:43:49

రేవ్ పార్టీపై పోలీసుల రైడ్‌.. 60 మంది అరెస్ట్‌

రేవ్ పార్టీపై పోలీసుల రైడ్‌.. 60 మంది అరెస్ట్‌

తిరువనంతపురం: రేవ్ పార్టీని కేరళ పోలీసులు భగ్నం చేశారు. 60 మందిని అరెస్ట్‌ చేశారు. ఇడుక్కి జిల్లా వాగమోన్ కొండ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఆదివారం రాత్రి రేవ్‌ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడికి వెళ్లి రైడ్‌ చేశారు. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు సినీ, టీవీ పరిశ్రమకు చెందిన వారని తెలుస్తున్నది. రేవ్‌ పార్టీని నిర్వహించిన 9 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఈ రిసార్ట్‌ స్థానిక సీపీఐ నేతకు చెందినదిగా పోలీసులు తెలిపారు. రైడ్‌ సందర్భంగా ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఆ నేతపై చర్యలు తీసుకుంటామని, పార్టీ నుంచి బహిష్కరిస్తామని సీపీఐ జిల్లా నేతలు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.