సోమవారం 25 జనవరి 2021
Crime - Oct 15, 2020 , 21:08:20

రేష‌న్ బియ్యం అక్ర‌మ నిల్వ‌లు ప‌ట్టివేత‌

రేష‌న్ బియ్యం అక్ర‌మ నిల్వ‌లు ప‌ట్టివేత‌

ఖమ్మం : రేష‌న్ బియ్యం అక్ర‌మ నిల్వ‌ల‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మం రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో గురువారం చోటుచేసుకుంది. వాలియాతాండాకు చెందిన ధ‌ర‌వ‌త్ వీరేశ్ ఇంట్లో రేష‌న్ బియ్యం అక్ర‌మంగా నిల్వ ఉంచిన‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంక‌ట్రావు ఆధ్వ‌ర్యంలో సీఐ వెంక‌ట‌స్వామి, ఎస్ఐ స‌తీశ్ కుమార్‌లు రైడ్ చేశారు. 150 క్వింటాళ్ల రేష‌న్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పీడిఎస్ బియ్యాన్ని ప‌లువురి నుంచి త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసి కాకినాడ‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. నిందితుల‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.


logo