మంగళవారం 01 డిసెంబర్ 2020
Crime - Oct 29, 2020 , 21:35:07

54 క్వింటాళ్ల రేష‌న్ బియ్యం ప‌ట్టివేత‌

54 క్వింటాళ్ల రేష‌న్ బియ్యం ప‌ట్టివేత‌

ఖమ్మం : అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 54 క్వింటాళ్ల రేష‌న్ బియ్యాన్ని పోలీసులు గుర్తించి ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసులు ఖమ్మం నగరంలోని అగ్రహారం గేటు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న రేష‌న్ బియ్యాన్ని పోలీసులు గుర్తించారు. చింతకానికి చెందిన పెనుకొండ నాగేశ్వర రావు అనే వ్యకి అక్రమంగా బియ్యాన్నిసేకరించిన రేవతి ట్రేడర్స్ చెందిన సురేష్‌కు విక్రయించేందుకు రవాణా చేస్తున్నట్లుగా స‌మాచారం. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు లారీని డ్రైవర్ లక్ష్మణ్ రావును  ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేష‌న్‌లో అప్ప‌గించారు.