శనివారం 16 జనవరి 2021
Crime - Nov 16, 2020 , 18:53:00

లైంగికదాడి బాధితురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన నిందితుడు

లైంగికదాడి బాధితురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన నిందితుడు

జైపూర్‌: లైంగికదాడి బాధితురాలిపై నిందితుడు పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడు. ఆమెతోపాటు అతడికి కూడా కాలిన గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. కొత్వాలి ప్రాంతానికి చెందిన 28 ఏండ్ల వ్యక్తి బంధువైన పొరుగింటి వివాహితపై 2018లో లైంగికదాడికి పాల్పడ్డాడు. అతడి ఆగడాలు భరించలేని బాధితురాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై కేసు నమోదు చేయడంతో ఊరి నుంచి పారిపోయాడు.

అయితే ఏడు నెలల తర్వాత దీపావళి సందర్భంగా జైపూర్‌కు అతడు తిరిగివచ్చాడు. తనపై ఫిర్యాదు చేసిన బాధితురాలి ఇంటికి దీపావళి రోజున వెళ్లాడు. ఆమెపై పెట్రోల్‌ పోసి మట్టి దీపంతో నిప్పుపెట్టాడు. ఈ సందర్భంగా అతడికి కూడా మంటలు అంటుకుని 30 శాతం మేర కాలిన గాయాలయ్యాయి. అయితే అక్కడి నుంచి పారిపోయి దవాఖానలో చేరాడు. మరోవైపు 50 శాతం కాలిన గాయాలైన బాధితురాలు దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఆమె ఫిర్యాదుతో నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడి తండ్రితోపాటు ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి