బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 16, 2020 , 16:22:42

త‌ల్లీకూతుళ్లను హ‌త్య చేసిన అత్యాచార నిందితుడు

త‌ల్లీకూతుళ్లను హ‌త్య చేసిన అత్యాచార నిందితుడు

ల‌క్నో : ఓ అత్యాచార నిందితుడు.. త‌న‌ను జైలుకు పంపిన త‌ల్లీకూతుళ్ల‌ను దారుణంగా హ‌త్య చేశాడు. ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని క‌స్గంజ్ జిల్లాలో మంగ‌ళ‌వారం సాయంత్రం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

అమ‌పూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని య‌శ్ వీర్ అనే యువ‌కుడు.. స్థానికంగా ఉన్న ఓ అమ్మాయితో ప‌రిచ‌యం పెంచుకున్నాడు. వారిద్ద‌రి మ‌ధ్య 2016, జులై వ‌ర‌కు స్నేహం బాగానే సాగింది. స్నేహాన్ని అడ్డు పెట్టుకుని.. అదే ఏడాది 13 ఏళ్ల వ‌య‌సున్న బాలిక‌పై అత్యాచారం చేశాడు. పోలీసులు య‌శ్ వీర్ ను 2016, అక్టోబ‌ర్ లో అరెస్టు చేశారు. ఆ త‌ర్వాత య‌శ్ వీర్ జైలు పాల‌య్యాడు. బెయిల్ పై 2017 చివ‌ర‌లో విడుద‌ల అయ్యాడు. అప్ప‌ట్నుంచి త‌న‌ను జైలు పాలు చేసిన అమ్మాయిపై ప‌గ పెంచుకున్నాడు. అదును చూసి దెబ్బ కొట్టాల‌నుకున్నాడు.

మంగ‌ళ‌వారం సాయంత్రం త‌ల్లీకూతుళ్లు ఇద్ద‌రు సైకిల్ పై వెళ్తున్నారు. వెనుక నుంచి ట్రాక్ట‌ర్ తో వ‌చ్చిన య‌శ్ వీర్.. వారి సైకిల్ ను బ‌లంగా ఢీకొట్టాడు. దీంతో త‌ల్లీకూతుళ్లు ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. య‌శ్ వీర్ అక్క‌డ్నుంచి త‌ప్పించుకున్నాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. ఇద్ద‌రి మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం సాయంత్రం చోటు చేసుకోగా, నిందితుడిని బుధ‌వారం సాయంత్రం అరెస్టు చేశారు.

అయితే య‌శ్ వీర్, బాధితురాలి కుటుంబాల‌కు మ‌ధ్య పాత గొడ‌వ‌లు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. డ‌బ్బు వివాదంలో య‌శ్ వీర్ తండ్రి మ‌హావీర్ ని బాధితురాలి తండ్రి హ‌త్య చేసిన‌ట్లు కేసు న‌మోదైంది. ఈ కేసులో యువ‌తి తండ్రి జైలుకెళ్లి.. 2018లో బెయిల్ పై వ‌చ్చాడు. య‌శ్ వీర్ కూడా ఆ బాలిక‌ను అత్యాచారం చేసి జైలుకు వెళ్లొచ్చాడు. ఇలా ఇరు కుటుంబాల మ‌ధ్య మూడు ఎఫ్ఐఆర్ లు న‌మోదైన‌ట్లు క‌స్గంజ్ పోలీసులు పేర్కొన్నారు.


logo