మంగళవారం 02 మార్చి 2021
Crime - Jan 26, 2021 , 16:39:11

యువ‌తిపై గ్యాంగ్ రేప్‌..

యువ‌తిపై గ్యాంగ్ రేప్‌..

జైపూర్‌: ప‌్ర‌భుత్వాలు ఎంత క‌ఠిన‌మైన చ‌ట్టాలు తీసుకొచ్చినా దేశంలో మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ ప్ర‌శ్నార్థ‌కంగానే మిగిలిపోయింది. దోషుల‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా శిక్షించేందుకు నిర్భ‌య చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చినా మ‌హిళ‌ల‌పై లైంగిక దాడుల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉన్న‌ది. తాజాగా రాజ‌స్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో అలాంటిదే మ‌రో దారుణం జ‌రిగింది. ముగ్గురు వ్య‌క్తులు క‌లిసి ఓ 25 ఏండ్ల యువ‌తిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. యువ‌తిపై అత్యంత పాశ‌వికంగా దాడి చేశారు.  

వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ నెల 19 స‌ద‌రు యువ‌తి త‌న ఇంటి నుంచి పొలం ద‌గ్గ‌ర‌కు వెళ్తుండ‌గా అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్య‌క్తులు ఆమెను అడ్డ‌గించారు. ప‌క్క‌న చెట్ల‌లోకి లాక్కెళ్లి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అయితే, స‌ద‌రు యువ‌తి వారిని తీవ్రంగా ప్ర‌తిఘ‌టించ‌డంతో తీవ్రంగా కొట్టారు. అనంత‌రం విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తామ‌ని బెదిరించి వ‌దిలేశారు. 

అయితే, త‌నపై జ‌రిగిన దారుణం గురించి యువ‌తి కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌జేయ‌డంతో వారు అదేరోజు సాయంత్రం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేర్పించారు. చికిత్స అనంత‌రం మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆమె ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యింది. ప‌రువు పోతుంద‌న్న కార‌ణంగా నాలుగు రోజులు విష‌యం బ‌య‌టికి రాకుండా జాగ్ర‌త్తప‌డ్డ కుటుంబ‌స‌భ్యులు.. ఎప్పటికైనా ప్ర‌మాద‌మేన‌ని భావించి ఆదివారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

బాధితురాలి కుటుంబ‌స‌భ్యుల ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధిత యువ‌తి చెప్పిన వివ‌రాల ఆధారంగా పంచురామ్ జాట్‌, క‌నారామ్ జాట్‌, శ్రావ‌న్ గుర్జ‌ర్ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించి వారిపై ఎఫ్ఐఆర్ రిజిస్ట‌ర్ చేశారు. ప‌రారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేప‌ట్టారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo