ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 16, 2020 , 18:18:03

నదిలో ఇద్దరు గల్లంతు.. ఇద్దరిని రక్షించిన స్థానికులు

నదిలో ఇద్దరు గల్లంతు.. ఇద్దరిని రక్షించిన స్థానికులు

టోంక్ ‌: రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న సోద్రా నదిలో వేర్వేరు చోట్ల ఇద్దరు గల్లంతు కాగా ఇద్దరిని స్థానికులు రక్షించారని పోలీసులు చెప్పారు. ఆదివారం ఉదయం సోద్రా నది వంతెన పైనుంచి ఇద్దరు బైక్‌పై వెళ్తుండగా బైక్‌ అదుపుతప్పి నదిలో పడిపోయింది. వీరిలో ఒకరిని స్థానికులు రక్షించగా, మరొకరు గల్లంతయ్యారు. పోలీసులు గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

మరో ఘటనలో వ్యక్తి తన పొలం నుంచి తిరిగి వస్తుండగా అతడి మేకల మందలో ఒకటి నదిలో పడిపోయింది. మేకను రక్షించేందుకు అతడు నదిలోకి దూకాడు. అతని కుమారుడు సైతం తండ్రికి సాయంగా దూకాడు. ఇద్దరు నది ప్రవాహంలో కొట్టుకుపోతుండగా అక్కడి వారు తండ్రిని రక్షించగా, కుమారుడు గల్లంతయ్యాడు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనా దళం ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించింది.

 


logo