కాంగ్రెస్ ఎమ్మెల్యే కైలాష్ చంద్ర మృతి

జైపూర్ : రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కైలాష్ చంద్ర త్రివేది (65) గుర్గావ్లోని దవాఖానలో మరణించినట్లు కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు మంగళవారం తెలిపాయి. ఇటీవల ఆయన కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నారు. ఆయన ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ గుర్గావ్లో మరణించారు. జైపూర్‌లో కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలతో త్రివేదిని ఎస్ఎంఎస్ దవాఖానలో చేర్పించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సహారా (భిల్వారా) నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు త్రివేది ఆరోగ్యం క్షీణించడంతో అక్టోబర్ 2న జైపూర్ నుంచి గుర్గావ్లోని మెదాంత హాస్పిటల్‌కు తరలించారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం అర్ధరాత్రి మరణించారు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే మృతిపై సీఎం అశోక్ గెహ్లాట్ నివాళులర్పించారు. కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. కష్ట సమయాల్లోనూ నిబ్బరంగా ఉండేవారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సింధు నిష్క్రమణ
- వంద రోజుల్లో వెయ్యి కంటి శస్త్రచికిత్సలు
- అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
- వుయ్ షుడ్ నెవర్ వేస్ట్ గుడ్ క్రైసిస్: హీరో చైర్మన్
- ‘ఈడబ్ల్యూసీ’తో అగ్రవర్ణ పేదలకు న్యాయం : కేటీఆర్
- ఎనీ బుక్ @ ఇంటర్నెట్
- కార్పొరేట్‌కు దీటుగా నేత కార్మికులు ఎదగాలి
- గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
- ‘పల్లె ప్రగతి’తో సత్ఫలితాలు
- కొత్త హంగులతో కోట