బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 14:37:09

టైరు పేలి ఆర్మీ వాహనం పల్టీ.. ఇద్దరు సైనికాధికారులు మృతి

టైరు పేలి ఆర్మీ వాహనం పల్టీ.. ఇద్దరు సైనికాధికారులు మృతి

బికనేర్‌/జైపూర్ : రాజస్థాన్‌లోని బికనేర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్‌ పేలడంతో ఆర్మీ వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఉదయం ఇద్దరు సైనికాధికారులు ఆర్మీ వాహనంలో బీకనేర్-జైపూర్‌ రహదారిపై ప్రయాణిస్తుండగా టైర్‌ పేలింది. దీంతో వాహనం బోల్తాపడటం అందులో ప్రయాణిస్తున్న కల్నల్‌ మనీష్ సింగ్ చౌహాన్, మేజర్ నీరజ్ శర్మలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన ఇద్దరిని పీబీఎం సైనికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించినట్లు సెరునా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అరుణ్ కుమార్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo