శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Sep 10, 2020 , 19:20:09

గూడ్స్ రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి మృతి

గూడ్స్ రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి మృతి

భద్రాద్రి కొత్తగూడెం : గూడ్స్ రైలు ఢీకొని ఓ రైల్వే ఉద్యోగి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని అశ్వాపురం మండలం గొందిగూడెం వద్ద గురువారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖమ్మం పట్టణానికి చెందిన కుమ్మరి అజయ్ కుమార్ (47) అశ్వాపురం రైల్వే స్టేషన్ లో రైల్వే పాయింట్స్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అజయ్ కుమార్ గొందిగూడెం వద్ద రైల్వే ట్రాక్ దాటుతుండగా..అశ్వాపురం నుంచి పాండురంగాపురం వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలును ప్రమాదవశాత్తు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అశ్వాపురం రైల్వే పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఎస్ఐ అశోక్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


logo