గురువారం 21 జనవరి 2021
Crime - Jan 09, 2021 , 16:34:18

రాచకొండ పరిధిలో 15 మంది మైనర్ల రెస్క్యూ

రాచకొండ పరిధిలో 15 మంది మైనర్ల రెస్క్యూ

హైదరాబాద్‌ : ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ తయారీ కంపెనీలో పనిచేస్తున్న 10 మంది మైనర్లను పోలీసులు శనివారం రెస్క్యూ చేశారు. ఈ ఘటన హయత్‌నగర్‌ పరిధిలోని కళానగర్‌, పసుమాములలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేశారు. సమాచారం మేరకు పోలీసులు శ్రీ పవన్‌పుత్ర ప్లాస్టర్‌ కంపెనీ, లక్ష్మణ్‌ ప్లాస్టర్‌ కంపెనీలపై రైడ్‌ చేశారు. ఈ సందర్భంగా భయంకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న పిల్లల్ని గుర్తించి రెస్క్యూ చేశారు. యజమానులు వీరిని బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి తీసుకువచ్చినట్లుగా సమాచారం. అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ పనిచేయించుకుంటున్నారు.

రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ.. ఇరు కంపెనీలకు చెందిన ఇ. జగన్‌ మోహన్‌రెడ్డి, లక్ష్మణ్‌లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మరొక కేసులో యాంటీ హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ హయత్‌నగర్‌లో ఉన్న ఓ కంపెనీ నుంచి ఐదుగురు బాలికలను రక్షించారు. శివ ట్రేడర్స్‌ కంపెనీకి చెందిన చన్నబత్తిన రవి(30) అనే వ్యక్తి ఈ మైనర్లను లిక్కర్‌ బాటిల్స్‌ను శుభ్రం చేసేపనిలో పెట్టాడు. బాటిల్‌కు 25 పైసల చొప్పున చెల్లిస్తున్నాడు. 


logo