శనివారం 16 జనవరి 2021
Crime - Dec 06, 2020 , 11:58:16

దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని ఓ లాడ్జిలో వ్య‌భిచారం

దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని ఓ లాడ్జిలో వ్య‌భిచారం

హైద‌రాబాద్ : ఆన్‌లైన్ ద్వారా విటుల‌ను ఆక‌ర్షించి వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను రాచ‌కొండ పోలీసులు అరెస్టు చేశారు. న‌గ‌రానికి చెందిన వ‌రుణ్ అనే వ్య‌క్తి ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన యువ‌తుల‌ను ర‌ప్పించి వ్య‌భిచారంలోకి దింపుతున్నాడు. ఇక ఆన్‌లైన్ ద్వారా విటుల‌ను ఆక‌ర్షించి, వారి వ‌ద్ద నుంచి డ‌బ్బులు తీసుకుని యువ‌తుల‌ను పంపుతున్నాడు. దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని ఓ లాడ్జిలో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న‌ట్లు రాచ‌కొండ పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో మానవ అక్ర‌మ ర‌వాణా నిరోధ‌క బృందం, స‌రూర్‌న‌గ‌ర్ పోలీసులు సంయుక్తంగా లాడ్జిపై దాడి చేశారు. అక్క‌డ ఓ యువ‌తితో పాటు విటుడి కోసం ఎదురుచూస్తున్న నిర్వాహ‌కులు మ‌హేంద‌ర్‌(32), సుజాత‌(50)ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత యువ‌తిని పోలీసులు రెస్క్యూ హోంకు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.