బుధవారం 27 జనవరి 2021
Crime - Oct 03, 2020 , 16:26:54

వ్య‌భిచార కేంద్రంపై దాడి.. మ‌హిళా అక్ర‌మ ర‌వాణా బ‌హిర్గ‌తం

వ్య‌భిచార కేంద్రంపై దాడి.. మ‌హిళా అక్ర‌మ ర‌వాణా బ‌హిర్గ‌తం

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని ఓ వ్య‌భిచార కేంద్రంపై దాడి చేసిన పోలీసులు మ‌హిళల అక్ర‌మ ర‌వాణా ముఠా గుట్టును బ‌హిర్గ‌తం చేశారు. రాచకొండ యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ మహిళా అక్రమ రవాణా ముఠాను ఛేదించింది. హైద‌రాబాద్‌ హయాత్‌నగర్‌లోని లెక్చరర్స్ కాలనీలో గ‌ల ఓ ఇంటిపై శుక్ర‌వారం రాత్రి రైడ్ చేసిన పోలీసులు బాధితురాలిని రక్షించడమే కాకుండా ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిర్వాహాకుల‌ను యు. యాద‌య్య‌, ఇతని భార్య చిట్టెమ్మ‌, హ్యుమ‌న్ ట్రాఫిక‌ర్ రాహుల్, కస్టమర్ భాస్కర్‌గా గుర్తించారు. ర‌క్షించిన మ‌హిళ‌ను బంగ్లాదేశ్‌కు చెందిన మ‌హిళ‌(26)గా తెలిపారు. ఇండ్ల‌లో ప‌ని నిమిత్తం ఇమ్రాన్ అనే వ్య‌క్తి మ‌హిళ‌ను బంగ్లాదేశ్ నుంచి తీసుకువ‌చ్చి రాహుల్‌కు అప్ప‌గించాడు. ఇత‌ను మ‌హిళ‌ను బ‌ల‌వంతంగా వ్య‌భిచార‌కూపంలోకి దించాడు. ఈ క్ర‌మంలో భాగంగానే వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న దంప‌తుల ఇంటికి స‌ద‌రు మ‌హిళ‌ను పంపించాడు.


logo