బుధవారం 20 జనవరి 2021
Crime - Dec 24, 2020 , 12:13:45

ఏటీఎం దొంగ‌ల ముఠా అరెస్ట్‌

ఏటీఎం దొంగ‌ల ముఠా అరెస్ట్‌

హైద‌రాబాద్‌: న‌గ‌ర శివార్ల‌లో వ‌రుస ఏటీఎం చోరీల‌కు పాల్ప‌డుతున్న కేసును పోలీసులు ఛేదించారు. వ‌న‌స్థ‌లీపురంలో వ‌రుస ఏటీఎం చోరీల‌కు పాల్ప‌డుతున్న మేవ‌త్ గ్యాంగ్‌ను రాచ‌కొండ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా రాజ‌స్థాన్‌కు చెందినదిగా గుర్తించారు. ముఠాలోని ఆరుగురు స‌భ్యుల‌ను పోలీసులు త‌మ ఆదీనంలోకి తీసుకున్నారు. వారి నుంచి లారీ, న‌గ‌దు, క‌ట్ట‌ర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.  

మేవ‌త్ గ్యాంగ్ గ‌త కొంత కాలంగా న‌గ‌ర శివార్ల‌లోని సెక్యూరిటీలేని ఏటీఎంలే ల‌క్ష్యంగా చోరీల‌కు పాల్ప‌డుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు 11కుపైగా ఏటీఎంల‌లో చోరీకి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు. హైద‌రాబాద్‌కు చెందిన ఓ దొంగ ఇచ్చిన స‌మాచారంతో చోరీల‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని పోలీసులు తెలిపారు. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఏటీఎంను ప‌గుల‌గొట్టి రూ.22 ల‌క్ష‌లు అప‌హ‌రించార‌ని వెల్ల‌డించారు.  

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్టులో వారం రోజుల వ్య‌వ‌ధిలో రెండు ఏటీఎంల‌లో చోరీ జరిగింది. యూనియ‌న్ బ్యాంక్‌లో చోరీకి ప్ర‌య‌త్నించిన దొంగ‌లు, ఇండిక్యాష్ ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కట్‌ చేసి చోరీకి పాల్పడ్డారు. ఇండీక్యాష్ ఏటీఎంలో గ్యాస్ కట్టర్లతో మిషన్లను తొలగించి లక్షల రూపాయలు దొంగిలించినట్లు అక్కడున్న సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

<p>లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో.<b><font color="#0000ff"> <a href="https://play.google.com/store/apps/details?id=com.namasthetelangana" target="_blank">నమస్తే తెలంగాణ</a></font></b><a  </a> ఆండ్రాయిడ్ యాప్   డౌన్లోడ్ చేసుకోండి.<br></p>


logo