సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 02, 2020 , 19:55:05

లంచం తీసుకున్నందుకు ఎస్ఐ స‌హా ఇద్ద‌రు కానిస్టేబుళ్లు సస్పెండ్‌

లంచం తీసుకున్నందుకు ఎస్ఐ స‌హా ఇద్ద‌రు కానిస్టేబుళ్లు సస్పెండ్‌

హైద‌రాబాద్ : ల‌ంచం తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఎస్ఐ స‌హా ఇద్ద‌రు కానిస్టేబుళ్లు స‌స్పెండ్ అయ్యారు. ఈ ఘ‌ట‌న రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో చోటుచేసుకుంది. దుష్ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా నాచారం పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్న ఎస్ఐ శివ‌కుమార్‌, కానిస్టేబుళ్లు ఇ. రాములు, ఎం. అశోక్ ల‌పై సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ స‌స్పెష‌న్ వేటు వేశారు. ‌నిషేధిత గుట్కా ఉత్ప‌త్తుల‌ను నిల్వ చేయ‌డంలో స‌హాయం చేసినందుకుగాను, లంచం డిమాండ్ చేసి తీసుకున్న కార‌ణంగా సీపీ శాఖాప‌ర‌మైన క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. ఏ పోలీస్ సిబ్బందియైనా అక్ర‌మ డిమాండ్ల‌కు పాల్ప‌డితే వాట్స‌ప్ నంబ‌ర్ 949061711 కు స‌మాచారం ఇవ్వాల‌సిందిగా సీపీ పౌరుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.logo