శుక్రవారం 15 జనవరి 2021
Crime - Nov 11, 2020 , 16:08:06

అక్రమంగా నిల్వ చేసిన పటాకులు స్వాధీనం

అక్రమంగా నిల్వ చేసిన పటాకులు స్వాధీనం

చండీగఢ్‌: కరోనా నేపథ్యంలో దీపావళి సందర్భంగా పటాకుల అమ్మకం, కాల్చడంపై పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో పటాకులను అక్రమంగా నిల్వ చేసి అమ్ముతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. పంజాబ్‌లోని లుధియానాలో ఒక నివాసిత ప్రాంతంలో భారీగా పటాకులను నిల్వ చేసినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. పలు బాక్సుల్లో భారీగా ఉంచిన పటాకులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.50 లక్షలకుపైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.