ముంబై: ఒక యువతి ఎత్తైన బిల్డింగ్ పైనుంచి పడి కిటికీ ఊచలకు చిక్కుకుని వేలాడసాగింది. గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు శ్రమించి ఆమెను రక్షించారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. యువతి ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి పడింది. అయితే అదృష్టవశాత్తు కిటికీ ఊచలకు ఆమె చిక్కుకోగా కింద ఉన్న అపార్ట్మెంట్ గ్రిల్స్ సపోర్టుతో వేలాడసాగింది. గమనించిన ఇరుగుపొరుగువారు వెంటనే పోలీసులు, ఫైర్ స్టేషన్కు కాల్ చేశారు. అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది తాడు, ఎత్తైన నిచ్చెన సహాయంతో ఆ యువతిని రక్షించి కిందకు దించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మొబైల్ ఫోన్లో తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.