శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jul 13, 2020 , 12:15:10

పబ్‌జీ గేమ్ ఆడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య

పబ్‌జీ గేమ్ ఆడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య

చిత్తూరు : పబ్‌జీ గేమ్ ఆడొద్దని మందలించడంతో బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లాలోని పలమనేరు శ్రీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే పబ్‌బీ గేమ్‌కు అలవాటుపడ్డ శ్యామ్ ప్రసాద్ (14)ను తల్లిదండ్రులు ఆడొద్దని మందలించారు. దీంతో మనస్థాపానికి గురైనా శ్యామ్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

గమనించిన తల్లిదండ్రులు బాలుడిని స్థానిక పలమనేరు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo