వికారాబాద్ కాల్పుల ఘటనలో పురోగతి

హైదరాబాద్ : వికారాబాద్‌లో ఆవుపై కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఘటనకు బాధ్యులు ఐదుగురు వ్యక్తులని గుర్తించి, ఇందులో నలుగురిని అరెస్టు చేశారు. కాల్పులకు తెగబడింది ఇమ్రాస్, మహామీర్ అజీర్, షేక్ మహబూబ్, రాంచందర్, రఫీగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. సీసీకెమెరాల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. నలుగురు నిందితుల్లో ఇమ్రాస్, హజర్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తేల్చారు.
అలాగే అడవులకు వెళ్లి జంతువులను వేటాడడం వీళ్ల సరదా అని పోలీసులు గుర్తించారు. వేటకు ముందు అడవులో రెక్కీ నిర్వహించిన ఇమ్రాస్, హజార్ నుంచి రైఫిల్, 9 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇమ్రాస్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈనెల 24న వికారాబాద్ జిల్లా, పూడూర్ మండలం, దామగుండం అటవీ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆవు మృతి చెందింది.
అడవుల్లో కాల్పుల మోత విన్న కొందరు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వేటగాళ్ల కోసం గాలింపు చేపట్టారు. తాజాగా ఈ కేసులో ఓ ప్రముఖ క్రీడాకారిణిపై కూడా ఆరోపణలు రావడంతో పోలీసులు దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టారు. క్రీడాకారిణి ఫాంహౌస్‌కు దగ్గర్లోనే కాల్పుల ఘటన చోటుచేసుకున్నాయని పలువురు గ్రామస్తులు ఆరోపణలు కూడా చేశారు. కొందరు రాజకీయ నేతలు కూడా ఈ ఘటనపై క్రీడాకారిణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కేసును సీరియస్‌గా విచారించిన పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- తాండవ్ మేకర్లకు షాక్
- అందుబాటులో ఇసుక : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- థాయ్‌లాండ్ ఓపెన్..పీవీ సింధుకు షాక్
- డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ ఎంతంటే...!
- అడవి పందిని చంపిన వేటగాళ్ల అరెస్ట్
- సవరణలకు ఓకే అంటేనే మళ్లీ చర్చలు: తోమర్
- అఖిలప్రియకు బెయిల్ మంజూరు
- ఎంపీ అర్వింద్..రాజీనామా చేశాకే రైతులతో మాట్లాడు
- అగ్నిప్రమాదంలో వెయ్యి కోట్లకుపైగా నష్టం: సీరమ్ సీఈవో
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!