ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 20, 2020 , 17:30:05

ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా .. తప్పిన ప్రమాదం

ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా .. తప్పిన ప్రమాదం

 భద్రాద్రి కొత్తగూడెం :  ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని తప్పించబోయి బోల్తా పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పుష్కరవనం వద్ద సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్ నుంచి జగదల్పూర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు సారపాక సమీపంలో.. పుష్కరవనం వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కనే బోల్తా పడింది. 

అయితే బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో డ్రైవరుకు కూడా ఏమి కాలేదని తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయంతో బయటకు తీశారు. బూర్గంపాడు ఎస్ఐ  బమ్మెర బాలకృష్ణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo